'థామా' .. ఇక తెలుగులోనూ చూడొచ్చు!
- రష్మిక ప్రధాన పాత్రగా రూపొందిన 'థామా'
- 200 కోట్లకు పైగా రాబట్టిన సినిమా
- ఈ నెల 2 నుంచి రెంటల్ విధానంలో స్ట్రీమింగ్
- 16 నుంచి సబ్ స్క్రయిబర్స్ అందరికీ అందుబాటులో
- తెలుగు ఆడియోతో చూసే ఛాన్స్
'థామా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ కి విశేషమైన ఆదరణ లభించింది. దాంతో అందరూ కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 2వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. దాంతో కొంతమందికి మాత్రమే ఇది సంతోషించదగిన విషయంగా నిలిచింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు అందరి ముచ్చటను తీర్చనుంది. తాజాగా ఫ్రీ ఓటీటీ రిలీజ్ డేట్ ను 'అమెజాన్ ప్రైమ్' వారు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ నుంచి సబ్ స్క్రయిబర్స్ అందరికీ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. వాళ్లంతా ఎలాంటి రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాను వీక్షించవచ్చు. అడవిలో రక్త పిశాచిగా ఉన్న నాయిక, కొన్ని కారణాల వలన జనంలోకి రావలసి వస్తుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ.