Shoban Babu: శోభన్ బాబు ఎంత జాగ్రత్తగా ఉండేవారంటే ..!

Thota Prasad Interview
  • అప్పట్లో విజయవాడకి ఆర్టిస్టుల తాకిడి ఎక్కువ 
  • సినిమా ఫంక్షన్లు అక్కడే ఎక్కువగా జరిగేవి 
  • శోభన్ బాబుగారు సమాధానాలు చెప్పరు .. రాస్తారు 
  • వివాదాలకు అవకాశం ఇవ్వకూడదనే అలా చేసేవారన్న తోట ప్రసాద్ 

శోభన్ బాబుతో పరిచయం ఉన్నవారు, ఆయన గురించి ఎంతసేపు చెబుతున్నా వినడానికి అభిమానులు ఉత్సహాన్ని చూపుతుంటారు. అప్పట్లో ఆయనకి గల క్రేజ్ అలాంటిది. అలాంటి శోభన్ బాబును గురించి, రీసెంటుగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత తోట ప్రసాద్ మాట్లాడారు. "నేను జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు, చాలామంది హీరోలతో పరిచయాలు ఉండేవి. వాళ్లను ఇంటర్వ్యూలు చేసేవాడిని" అని అన్నారు. 

"ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు, విజయవాడకి రాకపోకలు ఎక్కువగా ఉండేవి. తమ సినిమా విడుదలైతే ఆ సినిమా టీమ్ విజయవాడలో చూడటానికి వచ్చేది. సినిమా ఫంక్షన్లు కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉండేవి. శోభన్ బాబుగారు ఎప్పుడు అక్కడికి వచ్చినా ఒక హోటల్లో దిగేవారు. ఆయన వచ్చారని తెలియగానే  మహిళా అభిమానులంతా ఆయనను చూడటానికి వెళ్లేవారు. వాళ్లందరికీ రవ్వదోశలు తెప్పించి ఆయన చాలా సరదాగా మాట్లాడేవారు" అని అన్నారు. 

శోభన్ బాబుగారు ఇంటర్వ్యూలు ఇస్తారు. కాకపోతే ఆయన అప్పటికప్పుడు .. అక్కడికక్కడ సమాధానాలు ఇవ్వరు. ముందుగా ప్రశ్నలు రాసేసి ఇస్తే, రెండు రోజుల తరువాత ఆయన సమాధానాలు రాసేసి ఇస్తారు. మాట్లాడుతున్నప్పుడు పొరపాటున ఏదైనా ఓ మాట దొర్లితే, అనవసరమైన వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన ఆ జాగ్రత్తను తీసుకునేవారు" అని చెప్పారు. 

Shoban Babu
Telugu cinema
Telugu One
Thota Prasad
Vijayawada
Madras
Telugu film industry
Rava dosa
Interviews

More Telugu News