Bihar Wedding: రసగుల్లా కోసం గొడవ.. ఆగిన పెళ్లి.. వీడియో ఇదిగో!

Bihar Wedding Called Off After Rasgulla Fight
  • బీహార్ లోని బోధ్ గయలో పెళ్లి విందులో గొడవ
  • కుర్చీలు విసురుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్న బంధువులు
  • వివాహాన్ని రద్దు చేసుకున్న వధువు కుటుంబం..
  • వరుడి కుంటుంబంపై వరకట్న వేధింపుల కేసు
వివాహ విందులో రసగుల్లా అందలేదన్న చిన్న విషయంతో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునే వరకు వెళ్లింది. రెండు కుంటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటనతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

బీహార్ లోని బోధ్ గయలో ఈ నెల 29 న ఓ పెళ్లి జరుగుతోంది. స్థానికంగా ఉన్న హోటల్ లోని బాంకెట్ హాల్ లో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధూవరులు తమ గదులలో ముస్తాబువుతున్నారు. వారి వివాహానికి వచ్చిన ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు హోటల్ లో ఏర్పాటు చేసిన విందును ఆరగిస్తున్నారు. కాసేపటికి విందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన రసగుల్లా అయిపోయింది. ఈ విషయంపై మాటామాటా పెరగడంతో గొడవకు దారితీసింది. కాసేపటికే విందు జరుగుతున్న హాల్ లో పెద్ద యుద్ధమే మొదలైంది. కుర్చీలు గాల్లోకి లేచాయి, చేతికి అందిన వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ అరుచుకుంటూ.. డైనింగ్ హాల్ కాస్తా రణరంగంగా మార్చేశారు..

ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ గొడవతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెంది ఏకంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆపై వరుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడి కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే, ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Bihar Wedding
Rasgulla
Dowry Harassment
Bodh Gaya
Viral Video
Indian Wedding Fight
Wedding Cancelled
Bride
Groom

More Telugu News