IMD: తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిన వాయుగుండం .. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

IMD Forecasts Heavy Rains in AP Nellore Tirupati Districts
  • తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయన్న ఐఎండీ
  • నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. 

ఈ క్రమంలో ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 
 
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మి.మీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ, తిరుపతి జిల్లా మన్నారుపోలూరులో 32.7 మి.మీ, చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
IMD
India Meteorological Department
Andhra Pradesh Rains
Tamil Nadu Rains
Nellore
Tirupati
Heavy Rainfall Alert
AP Weather Forecast
Cyclone Update
Low Pressure Area

More Telugu News