AP TET: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల

AP TET Hall Tickets Released Download Now
  • టెట్ హాల్ టికెట్లను విడుదల చేసిన అధికారులు
  •  డిసెంబర్ 10 నుంచి రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు
  • మొత్తం 2.71 లక్షలకుపైగా దరఖాస్తులు దాఖలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు నిన్న విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షలను ప్రతిరోజూ రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని ఆయన తెలిపారు.
 
ఈ ఏడాది టెట్ కోసం అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించగా, రాష్ట్రవ్యాప్తంగా 2,41,509 మంది అభ్యర్థుల నుంచి 2,71,692 దరఖాస్తులు వచ్చాయని కృష్ణారెడ్డి వివరించారు. అభ్యర్థులు పరీక్ష విధానంపై అవగాహన పెంచుకునేందుకు వెబ్‌సైట్‌లో మాక్ టెస్టులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
 
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఇలా..
 
* అభ్యర్థులు ముందుగా https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో కనిపించే ‘Candidate Login’ పై క్లిక్ చేయాలి.
* అక్కడ మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి.
AP TET
TET Hall Tickets
MV Krishna Reddy
AP Teacher Eligibility Test
Andhra Pradesh TET Exam
TET Exam Date
TET Mock Test
AP DSC
Teacher Recruitment
Education Andhra Pradesh

More Telugu News