Kishan Reddy: రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy Demands Revanth Reddy Apology to Hindu Community
  • హిందూ దేవుళ్లను అవమానించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శ
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని వ్యాఖ్య
  • హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో గుర్తుంచుకోండని హితవు
కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయని అన్నారు. గతంలో కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కాదని పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. హిల్ట్ పాలసీని హడావుడిగా తీసుకు వచ్చారని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు హిల్ట్ పేరుతో నగరంలో 9 వేల ఎకరాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే జరగబోయే పరిణామాలను ముఖ్యమంత్రి అంచనా వేశారా అని నిలదీశారు. హైదరాబాద్ నగరాన్ని మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గుర్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా అదే స్థితికి తీసుకురావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో తాను ఏకైక మేధావినని గతంలో కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారని విమర్శించారు.
Kishan Reddy
Revanth Reddy
Telangana Congress
Hindu Gods
Apology
HILT Policy

More Telugu News