CCTV hack: పోర్న్ వీడియోల కోసం ఇళ్లు, ఆఫీసుల్లోని 1.2 లక్షల సీసీ కెమెరాల హ్యాక్.. ఎక్కడంటే..!

South Korea CCTV Hack 12 Lakh Cameras Hacked for Porn Videos
  • సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై సైబర్ నేరస్తుల కన్ను
  • సౌత్ కొరియాలో దారుణం.. ఆన్ లైన్ లో వీడియోల అమ్మకం
  • ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీ కెమెరాలు వాడుతుంటే జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
ఇంట్లో, ఆఫీసులో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారు. ఏకంగా 1.20 లక్షల సీసీ కెమెరాలను హ్యాక్ చేసి మహిళలు, దంపతులు ఏకాంతంగా ఉన్న వీడియో క్లిప్ లను సేకరించి పోర్న్ వీడియోలు తయారు చేశారు. వాటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. సౌత్ కొరియాలో వెలుగుచూసిన ఈ భారీ సైబర్ స్కామ్ తో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీ కెమెరాలు అమర్చుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, తరచుగా పాస్ వర్డ్ లు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

మిగతా వాటితో పోలిస్తే ఇంటర్నెట్ కనెక్టెడ్ సీసీ కెమెరాల ధర చాలా తక్కువ. దీంతో చాలామంది వీటిని కొనుగోలు చేసి తమ ఇళ్లు, ఆఫీసుల్లో అమర్చుకుంటున్నారు. వీటితో సెక్యూరిటీ మాటెలా ఉన్నా ఈ సీసీ కెమెరాల సెక్యూరిటీ విషయంలో అజాగ్రత్త వల్ల హ్యాకర్ల బారిన పడుతున్నారు. కంచే చేను మేసిన చందంగా భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే సైబర్ దుండగుల బారిన పడడానికి కారణమవుతున్నాయి. ఈ సీసీ కెమెరాలను ఇంటర్నెట్‌ కు కనెక్ట్ చేసి మొబైల్ యాప్‌ల ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే సౌలభ్యం ఉంది. అయితే ఈ కెమెరాలకు పాస్ వర్డ్ ల విషయంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల హ్యాకర్లు వీటిని సులువుగా తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. వీటి ద్వారా వీడియోలను సేకరించి ఆన్‌లైన్ ద్వారా అమ్మి సొమ్ము చేసుకున్నారు.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఒక నిందితుడు 63 వేల సీసీ కెమెరాలను హ్యాక్ చేసి 545 లైంగిక కంటెంట్ ఉన్న వీడియోలను తయారు చేశాడని, వాటిని ఆన్ లైన్ లో అమ్మి రూ. 22 లక్షలు సంపాదించాడని తేలింది. మరొక నిందితుడు 70 వేల కెమెరాల నుంచి 648 వీడియోల డేటాను అమ్మి రూ. 11 లక్షలు సొమ్ము చేసుకున్నాడు. దీంతో ఈ వీడియోలను అందుబాటులో ఉంచిన వెబ్ సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేసిన పోలీసులు.. వాటిని శాశ్వతంగా మూసి వేయడానికి చర్యలు చేపట్టారు.
CCTV hack
CCTV camera hack
cyber crime South Korea
porn video scandal
internet security
privacy breach
digital surveillance
online safety

More Telugu News