Pakistan: సాయం పేరిట.. ఎక్స్‌పైరీ అయిన ఆహారాన్ని శ్రీలంకకు పంపిన పాకిస్థాన్!

Pakistan Sends Expired Food Aid to Sri Lanka
  • కాలం చెల్లిన వైద్య సామగ్రి, తినడానికి ఉపయోగపడని ఆహార ప్యాకెట్లను పంపినట్లు ప్రచారం
  • శ్రీలంకలోని పాక్ హైకమిషన్ చేసిన ట్వీట్‌లో ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాల ఫొటోలు
  • పాక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీలంక
దిత్వా తుపాను సహాయార్థం శ్రీలంకకు పాకిస్థాన్ పంపిన అత్యవసర సహాయంలో గడువు తీరిన వైద్య సామగ్రి, వినియోగానికి పనికిరాని ఆహార పొట్లాలు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. తుపానుతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్‌తో పాటు పలు దేశాలు సహాయం అందించాయి. పాకిస్థాన్ కూడా సహాయం పేరుతో పంపిన వస్తువులు ఎక్స్‌పైర్డ్ అయ్యాయని శ్రీలంక అధికారులు చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్ పంపిన వైద్య సామగ్రి, ఆహార పొట్లాలు, ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన మానవతా సహాయంలో గడువు తేదీ ముగిసిన వస్తువులు ఉన్నట్లు గుర్తించడం పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శ్రీలంక అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్ పంపిన సామాగ్రి కొలంబో చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ, శ్రీలంకకు పాకిస్థాన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ సామాజిక మాధ్యమల్లో పోస్టు చేసింది. అయితే, ఈ ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్‌తో ముగిసిపోయింది. ఇది గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు  సమాచారం.
Pakistan
Sri Lanka
Dithva Cyclone
Expired Food
Expired Medicine
Humanitarian Aid

More Telugu News