Revanth Reddy: గ్లోబల్ సదస్సు... మోదీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు కోమటిరెడ్డి ఆహ్వానం

Revanth Reddy to Invite Modi to Global Summit
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
  • ఆహ్వానించే బాధ్యతలు మంత్రులకు అప్పగింత
  • ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్న ఎంపీల బృందం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించే బాధ్యతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగించారు. సదస్సుకు ప్రధానమంత్రి సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఢిల్లీ వెళుతున్న రేవంత్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 సదస్సుకు ఆహ్వానం పలకనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. రాష్ట్ర ఎంపీల బృందం ఢిల్లీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనుంది.

మంత్రులకు ఆహ్వాన బాధ్యతలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), ఉత్తమ్ కుమార్ రెడ్డి (జమ్ము కశ్మీర్, గుజరాత్), దామోదర రాజనర్సింహ (పంజాబ్, హర్యానా), శ్రీధర్ బాబు (కర్ణాటక, తమిళనాడు), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఉత్తరప్రదేశ్), పొన్నం ప్రభాకర్ (రాజస్థాన్), కొండా సురేఖ (ఛత్తీస్‌గఢ్), సీతక్క (పశ్చిమ బెంగాల్), తుమ్మల నాగేశ్వరరావు (మధ్యప్రదేశ్), జూపల్లి కృష్ణారావు (అసోం), జి. వివేక్ (బీహార్), శ్రీహరి (ఒడిశా), అడ్లూరి లక్ష్మణ్ (హిమాచల్ ప్రదేశ్), అజారుద్దీన్ (మహారాష్ట్ర) ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు.
Revanth Reddy
Telangana Rising Global Summit
Narendra Modi
Chandra Babu Naidu

More Telugu News