Christopher Luxon: జిలేబీలు వేసిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్

Christopher Luxon Makes Jalebi at Sikh Community Event
  • అక్లాండ్‌లో జరిగిన సిక్కు కమ్యూనిటీ క్రీడలను ప్రారంభించిన క్రిస్టోఫర్
  • జిలేబీలు వేసి ఆకట్టుకున్న ప్రధాని క్రిస్టోఫర్
  • అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ ఆక్లాండ్‌లో జరిగిన సిక్కు కమ్యూనిటీ క్రీడల్లో సంప్రదాయ భారతీయ జిలేబీలను తయారు చేశారు. ఆయన జిలేబీలు వేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. క్రిస్టోఫర్ స్థానిక ఎంపీ రిమా నఖ్లేతో కలిసి టకానినిలో జరిగిన క్రీడా కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆయన అథ్లెట్లను కలిసి, క్రీడాకారులు, సహాయకులతో ముచ్చటించారు.

అనంతరం అక్కడ జిలేబీలు తయారు చేస్తున్న వారి వద్దకు వెళ్లి సరదాగా జిలేబీలు వేశారు. ఆయన నవ్వుతూ కడాయిలో జిలేబీలు వేస్తుంటే అక్కడున్న వారు ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత అక్కడున్న వారికి స్వయంగా జిలేబీలను అందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను క్రిస్టోఫర్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ రీమా నఖ్లేతో కలిసి సిక్కు క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న వారికి, అలాగే తన చేతి జిలేబీ తిన్న వారికి శుభాకాంక్షలు అని ఆయన రాసుకొచ్చారు.
Christopher Luxon
New Zealand Prime Minister
Jalebi
Sikh Community
Auckland

More Telugu News