Dulquer Salmaan: బాలీవుడ్ తీరుపై దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

Dulquer Salmaans Shocking Remarks on Bollywood Treatment
  • బాలీవుడ్‌, మలయాళ పరిశ్రమల మధ్య ఎంతో తేడా ఉందన్న దుల్కర్
  • హిందీలో స్టార్‌డమ్ చూపిస్తేనే గౌరవం ఇస్తారని వ్యాఖ్య
  • లేకపోతే కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా దొరకదని విమర్శ
భాషతో సంబంధం లేకుండా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య పని సంస్కృతిలో చాలా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. హిందీలో పెద్ద స్టార్ అనిపించుకోకపోతే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురికావాల్సి వస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు.

ఓ తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ.. "బాలీవుడ్‌లో నటించేటప్పుడు, నేను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చేది. నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉండేవారు. మనం లగ్జరీ కారులో వస్తేనే మనల్ని స్టార్‌గా గుర్తిస్తారు. అలా లేకపోతే సెట్‌లో కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వరు, మానిటర్ చూడటానికి కూడా స్థలం కేటాయించరు" అని అన్నారు. 2018లో ‘కార్వాన్’ చిత్రంతో దుల్కర్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

మలయాళ చిత్ర పరిశ్రమ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని దుల్కర్ వివరించారు. "మా ఇండస్ట్రీలో సినిమాలకు ఎక్కువ ఖర్చు ఉండదు. ఇక్కడ లగ్జరీకి ఎవరూ ప్రాధాన్యం ఇవ్వరు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. చాలా వస్తువులు ఇంటి నుంచే తెచ్చుకుంటాం" అని రెండు పరిశ్రమల మధ్య ఉన్న తేడాను స్పష్టం చేశారు.

ఇక దుల్కర్ సినిమాల విషయానికొస్తే, ఆయన ఇటీవలే ‘కాంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
Dulquer Salmaan
Bollywood
Malayalam film industry
Karwaan
হিন্দি সিনেমা
Pan-India films
সেলভামণি সেলভராஜ்
Kaanta
Netflix
Indian cinema

More Telugu News