Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. సమంత పెళ్లి గురించేనా?

Poonam Kaur Tweet Sparks Controversy Allegedly Targeting Samanthas Marriage
  • సంచలన ట్వీట్‌తో మరోసారి వార్తల్లో పూనమ్ కౌర్
  • 'ఒకరి ఇల్లు కూల్చి ఇల్లు కట్టుకుంటావా' అంటూ ట్వీట్
  • సమంత పెళ్లిని ఉద్దేశించే వ్యాఖ్యలని నెటిజన్ల అనుమానం
నటి పూనమ్ కౌర్ మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పేరు ప్రస్తావించనప్పటికీ, ఈ వ్యాఖ్యలు స్టార్ హీరోయిన్ సమంతను ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వివరాల్లోకి వెళ్తే, "నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? ఇది చాలా బాధాకరం. పైగా ఆమె చాలా శక్తిమంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. బలహీనమైన, నిరాశతో ఉన్న పురుషులను డబ్బు కొనుగోలు చేయగలదు" అని పూనమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్ టైమింగ్ వల్లే ఈ వివాదం రాజుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత నిన్న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్‌కు ఇదివరకే శ్యామలాదేవి అనే మహిళతో వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు. సమంతతో సంబంధం కారణంగానే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పూనమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దీంతో నెటిజన్లు ఈ ట్వీట్‌ను సమంత వివాహంతో ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు. "సమంత పెళ్లి కోసం మరో కుటుంబం విడిపోయిందా?", "మొదటి భార్య పరిస్థితి ఏంటి?" అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటిలాగే పూనమ్ కౌర్ తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపారు. ఈ వివాదంపై సమంత గానీ, ఆమె టీమ్ గానీ స్పందిస్తారో లేదో చూడాలి.
Poonam Kaur
Samantha Ruth Prabhu
Samantha marriage
Raj Nidimoru
Shyamala Devi
Divorce controversy
Tollywood
Social media
Poonam Kaur tweet
Celebrity news

More Telugu News