బాలకృష్ణ అఖండ-2 నుంచి హైందవం సాంగ్ రిలీజ్
- నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' నుంచి తొలి పాట విడుదల
- 'హైందవం' పేరుతో లిరికల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం
- సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించిన ఈ పాటకు థమన్ సంగీతం
- డిసెంబరు 5న థియేటర్లలోకి రానున్న 'అఖండ 2: తాండవం'
ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించగా, ప్రఖ్యాత 'సర్వేపల్లి సిస్టర్స్' గాయనీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి తమ గాత్రంతో ఆలపించారు. ఎస్. థమన్ సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక భావనతో సాగే ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'అఖండ 2: తాండవం' చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ప్రత్యేకంగా ఉండనుంది. సంస్కృత శ్లోకాలు, వేదమంత్ర పఠనంలో నిష్ణాతులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. వారి శ్లోకాలు సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.