Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్‌పై అప్డేట్!
- పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్'
- దేవి శ్రీ ప్రసాద్ సంగీతం... త్వరలో మొదటి పాట
- సినిమాపై భారీ అంచనాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్రబృందం ఇచ్చింది. త్వరలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి మొదటి పాట అనౌన్స్మెంట్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "మీరు ఇష్టపడే ఎనర్జీ, మీరు ఆస్వాదించే డ్యాన్స్, మీరు వేడుక చేసుకునే యాటిట్యూడ్.. ఇవన్నీ ఒకే పాటలో మా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ప్రకటన త్వరలోనే వస్తుంది. డిసెంబర్ నెల పవర్ స్టార్ వేడుకగా మారుతుంది," అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పవన్ ఎనర్జీకి, దేవిశ్రీ మ్యూజిక్కు, హరీశ్ శంకర్ టేకింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో రాబోయే ఈ పాట అనౌన్స్మెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.