Revanth Reddy: వారికి ఐఏఎస్‌ హోదా ఎందుకు కల్పించారు?: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Revanth Reddy Government Shocked by High Court on IAS Cadre
  • తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
  • శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించడంపై ఆగ్రహం
  • డిసెంబర్ 10 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పలువురు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని, అది చట్టవిరుద్ధమని వడ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీకాంత్ తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద ధర్మాసనం ముగ్గురు అధికారులకు ఐఏఎస్ హోదాను ఎందుకు కల్పించారో డిసెంబర్ 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించారు.
Revanth Reddy
Telangana High Court
IAS officers
IPS officers
Shikha Goel
CV Anand

More Telugu News