Samantha Ruth Prabhu: పెళ్లితో ఒక్కటైన సమంత-రాజ్ నిడిమోరు.. పెళ్లి ఫస్ట్ పిక్స్ ఇవిగో!

Samantha Ruth Prabhu and Raj Nidimoru Tie the Knot Wedding Photos
  • తమిళనాడు ఈశా ఫౌండేషన్‌లో ప్రైవేట్ గా పెళ్లి వేడుక
  • కొద్దిమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన వివాహం
  • సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫొటోలను పంచుకున్న జంట
స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ఈ ఉదయం వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా, ప్రైవేట్ గా జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించారు.

తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహ వేడుక జరిగింది. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుకను పూర్తిచేశారు. అనంతరం సమంత, రాజ్ నిడిమోరు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పెళ్లి ఫొటోలను షేర్ చేశారు.

2024 నుంచి వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వారు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయితే, గత కొద్ది నెలలుగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా కొన్ని హింట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని సస్పెన్స్ కు తెరదించారు. ప్రస్తుతం ఈ నూతన జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
Samantha Ruth Prabhu
Samantha marriage
Raj Nidimoru
Samantha Raj Nidimoru wedding
Isha Foundation
Lingabhairavi Temple
Tamil Nadu
Celebrity wedding
Telugu cinema
South Indian actress

More Telugu News