APSDMA: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం... ఏపీఎస్డీఎంఏ తాజా అలర్ట్

APSDMA Alert Heavy Rains Expected in Andhra Pradesh Due to Cyclone
  • మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం
  • నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక
  • దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను గత రాత్రి బలహీనపడడడం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోందని, సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్రలోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఆయన వివరించారు.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
APSDMA
Andhra Pradesh State Disaster Management Authority
Cyclone Dithwa
Bay of Bengal
Nellore
Tirupati
Heavy Rains
Weather Alert
Fishermen Warning
Prakhar Jain

More Telugu News