Smriti Mandhana: ఇన్ స్టాలో జెమీమా ఆసక్తికర పోస్టు.. స్మృతి మంధాన గురించేనా..!

Jemimah Rodrigues post sparks speculation about Smriti Mandhana wedding
  • అర్ధాంతరంగా ఆగిపోయిన స్మృతి మంధాన వివాహం
  • స్మృతి కోసం టోర్నమెంట్ వదులుకున్న జెమీమా
  • కష్టకాలంలో స్నేహితురాలి వెంటే ఉన్న మహిళా క్రికెటర్
ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన వివాహం స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరడంతో రద్దయింది. ఆ తర్వాత స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అటు తండ్రి, ఇటు కాబోయే భర్త ఇద్దరూ కోలుకుని ఇంటికి చేరుకున్నా పెళ్లి విషయంపై స్మృతి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో స్మృతి, పలాశ్ ల వివాహం పూర్తిగా రద్దయినట్లేనని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో స్మృతి సన్నిహిత మిత్రురాలు, మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తాజాగా తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘దేవుడి అనుగ్రహం ప్రతిరోజూ తోడుగా ఉంటుంది. ముఖ్యంగా కష్ట సమయంలో ఆయన మన వెన్నంటే ఉంటాడు’ అంటూ జెమీమా పోస్టు చేసింది. స్మృతి మంధాన వివాహం రద్దయిన వేళ జెమీమా పెట్టిన ఈ పోస్టుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. స్మృతిని ఉద్దేశించి, ఆమెకు ఓదార్పుగా జెమీమా ఈ పోస్టు పెట్టిందని అభిమానులు భావిస్తున్నారు.
Smriti Mandhana
Jemimah Rodrigues
Indian Women's Cricket
Smriti Mandhana Wedding
Palash Muchhal
Cricket News
Sports News
Women's Cricket
Instagram Post

More Telugu News