Virat Kohli: టెస్టు క్రికెట్ లోకి విరాట్ పునరాగమనం..!

Virat Kohli Test Cricket Comeback Possible
  • కోహ్లీని బీసీసీఐ అభ్యర్థించనుందని ప్రచారం
  • టెస్టు ఫార్మాట్‌లో జట్టును బ్యాలెన్స్‌ చేసే ప్రయత్నం
  • జట్టుకు దూరమైన టెస్టు స్పెషలిస్టులు పుజారా, రహానే
టెస్టు మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్ లలో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బీసీసీఐ పెద్దలు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టులో సమతూకం కోసం విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లో ఆడించాలని, ఈమేరకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోహ్లీని కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

‘క్రిక్‌ బజ్‌’ వెల్లడించిన సమాచారం ప్రకారం.. టెస్టు ఫార్మాట్‌ లో జట్టును బ్యాలెన్స్‌ చేసే క్రమంలో పలువురు టెస్టు స్పెషలిస్టులను రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరనుంది. విరాట్ కోహ్లీతో పాటు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే తదితర టెస్టు స్పెషలిస్టులనూ పిలవనున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ కోరితే.. తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఓ ఆటగాడు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో భారత జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వైట్ వాష్ కావడంతో టెస్టు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టులో మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో మార్పులు సజావుగా జరగట్లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత టెస్టు జట్టు పూర్తిగా లయ తప్పిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Virat Kohli
Virat Kohli Test Cricket
BCCI
Indian Cricket Team
Cheteshwar Pujara
Ajinkya Rahane
Test Retirement Reversal
Gautam Gambhir
India vs South Africa Test Series
Test Specialists

More Telugu News