Coupang: కూపాంగ్లో అతిపెద్ద డేటా బ్రీచ్.. 3.37 కోట్ల మంది కస్టమర్ల వివరాలు చోరీ!
- ఈ-కామర్స్ సంస్థ కూపాంగ్లో భారీ డేటా బ్రీచ్
- నెలల తరబడి విదేశీ సర్వర్ల నుంచి డేటా లీకైనట్లు వెల్లడి
- సంస్థ మాజీ చైనా ఉద్యోగిపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం కూపాంగ్లో అతిపెద్ద డేటా బ్రీచ్ జరిగింది. దాదాపు 3.37 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కంపెనీ స్వయంగా ధ్రువీకరించింది. ఈ సంఘటనతో కస్టమర్లలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల పాటు ఈ డేటా చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, డెలివరీ అడ్రస్లు లీక్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, పేమెంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. జూన్ 24 నుంచే విదేశీ సర్వర్ల ద్వారా తమ కస్టమర్ల డెలివరీ సంబంధిత సమాచారాన్ని అనధికారికంగా యాక్సెస్ చేసినట్లు గుర్తించామని అని కూపాంగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కేసుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ డేటా బ్రీచ్ వెనుక కంపెనీకి చెందిన ఒక మాజీ చైనా ఉద్యోగి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను ప్రస్తుతం కంపెనీలో పనిచేయడం లేదని, ఇప్పటికే దేశం విడిచి వెళ్ళిపోయాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నవంబర్ 18న ఈ ఉల్లంఘనను గుర్తించిన కూపాంగ్, రెండు రోజుల్లో అధికారులకు సమాచారం ఇచ్చింది. తొలుత కేవలం 4,500 మంది కస్టమర్ల డేటా మాత్రమే లీక్ అయినట్లు కంపెనీ నివేదించింది. అయితే, దర్యాప్తులో ఈ సంఖ్య కోట్లలో ఉందని తేలడంతో వినియోగదారులు తమ సమాచారం దుర్వినియోగం అవుతుందేమోనని భయపడుతున్నారు. గతంలో ఎస్కే టెలికాంకు చెందిన 2.32 కోట్ల మంది డేటా లీకైన ఘటనకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో 13,480 కోట్ల వాన్ల జరిమానా విధించింది. ప్రస్తుత కూపాంగ్ ఉల్లంఘన దానిని మించి ఉండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.