Ram Charan: 'పెద్ది' సెట్స్‌లో భారీ యాక్షన్ సీన్.. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ హీరో తండ్రి

Peddi Movie Action Scene Supervised by Vicky Kaushals Father
  • హైదరాబాద్‌లో శరవేగంగా 'పెద్ది' మూవీ షూటింగ్
  • రామ్ చరణ్, శివరాజ్‌కుమార్‌పై కీలక యాక్షన్ సీన్స్
  • రంగంలోకి దిగిన బాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ షామ్ కౌశల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ కీలక షెడ్యూల్‌లో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ (శివన్న) కూడా పాల్గొంటున్నారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌కు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్, హీరో విక్కీ కౌశల్ తండ్రి అయిన షామ్ కౌశల్ పర్యవేక్షణ అందిస్తుండటం విశేషం. 'దంగల్', 'బాజీరావ్ మస్తానీ' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఆధ్వర్యంలో నవకాంత్ మాస్టర్ ఈ ఫైట్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారు. వందలాది మంది ఫైటర్లు పాల్గొంటున్న ఈ సన్నివేశాన్ని అత్యంత సహజంగా, 'రఫ్ అండ్ రా' మాస్ యాక్షన్‌తో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సినిమా కథలో ఈ ఫైట్ అత్యంత కీలకమైన మలుపుగా నిలుస్తుందని, సినిమాకే హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని తొలి సింగిల్ 100 మిలియన్ల వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Shivarajkumar
Sham Kaushal
Action Sequence
Telugu Cinema
Navakanth Master
Hyderabad Aluminum Factory

More Telugu News