Vijay Deverakonda: 'ఖుషీ' టైంలో విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇచ్చా: ఐబొమ్మ రవి

Vijay Deverakonda Warned by iBOMMA Ravi During Khushi Release
  • డబ్బు సంపాదించాలనే దురాశతోనే పైరసీ చేశానని అంగీకారం
  • ఈ వ్యవహారంతో తనకు తప్ప మరెవరికీ సంబంధం లేదన్న నిందితుడు
  • ఐబొమ్మ, బప్పం పేర్ల వెనుక ఉన్న అర్థాన్ని వివరించిన రవి
  • టెలిగ్రామ్, ఓటీటీల నుంచి సినిమాలు సేకరించినట్లు వాంగ్మూలం
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. 2023లో ‘ఖుషీ’ సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండను తాను నేరుగా బెదిరించినట్లు అంగీకరించాడు. పైరసీని అడ్డుకునేందుకు విజయ్ ప్రయత్నించడంతో, ఆయనను హెచ్చరిస్తూ ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టినట్లు ఒప్పుకున్నాడు.

ఆనాడు విజయ్‌ను ఉద్దేశించి పెట్టిన హెచ్చరికను పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. ‘‘మా మీద ఫోకస్ చేస్తే.. మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని మా టీమ్ ముందే చెప్పింది. కానీ మీరు వినలేదు. ఏజెన్సీలకు డబ్బులిచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకే మీ కింగ్‌డమ్ సినిమా బయటకు తెస్తాం’’ అని రవి హెచ్చరించినట్లు ఆ ప్రకటనలో ఉంది.

పైరసీ కేసులో అరెస్టయిన రవి పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. కేవలం డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని, ఈ వ్యవహారంతో ప్రపంచంలో మరెవరికీ సంబంధం లేదని అతడు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 
Vijay Deverakonda
Khushi movie
iBOMMA Ravi
Imandi Ravi
Piracy website
Movie piracy
Telugu cinema
Cyber crime
Film industry
Movie leaks

More Telugu News