Al Falah University: ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో రూ.18 లక్షల నగదు గుర్తించిన ఎన్ఐఏ
- ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో కీలకంగా మారిన ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ
- కీలక నిందితురాలు షాహీన్ ఉన్న గదిలో నగదు దొరికినట్లు మీడియాలో కథనాలు
- వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కార్యకలాపాల కోసం దాచినట్లు వార్తలు
సుమారు 20 రోజుల క్రితం ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అధికారులు రూ.18 లక్షల నగదును గుర్తించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసును ముమ్మరంగా విచారిస్తోంది. ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక నిందితురాలైన షాహీన్ షహీద్ ఉన్న గదిలో నగదు లభ్యమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఈ నగదు మొత్తాన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కార్యకలాపాల కోసం ఉపయోగించేందుకే దాచిపెట్టినట్లు తెలుస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో అనే విషయంపై దృష్టి సారించారు. మరోవైపు, షాహీన్ ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.