KCR: కేసీఆర్ బయటకు రావడం లేదన్న కాంగ్రెస్ విమర్శలపై కేటీఆర్ స్పందన

KTR responds to Congress criticisms on KCR not coming out
  • కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావడం లేదని అంటున్నారన్న కేటీఆర్
  • గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్‌గానే ఉంటుందని వ్యాఖ్య
  • నాయకుడు ఎప్పటికైనా నాయకుడే అన్న కేటీఆర్
మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఏడాదిన్నరగా బయటకు రావడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్‌గానే ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు. నాయకుడు ఎప్పటికైనా నాయకుడేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తే అప్పుడు అసలు విషయం తెలుస్తుందని అన్నారు. తెలంగాణ తల్లిని అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చోట తిరిగి తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత తమదే అన్నారు.
KCR
KTR
BRS
Congress
Telangana
Telangana Thalli
Revanth Reddy
Telangana Politics
Telangana MLAs

More Telugu News