fever deaths: 48 గంటల్లో ముగ్గురు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. జ్వరంతోనే ముగ్గురూ మృతి

UP Family Mourns Death of Three Children Due to Fever
  • యూపీలోని నెబువాలో విషాదం
  • వారం రోజుల క్రితం పెద్ద కుమార్తెకు జ్వరం
  • పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూత
  • శుక్రవారం ఉదయం చిన్న కుమార్తె, కుమారుడు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్వరంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఒకే రకమైన లక్షణాలతో ముగ్గురు పిల్లలూ 48 గంటల్లోనే చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసి ప్రభుత్వం అప్రమత్తమై వైద్య బృందాన్ని ఆ గ్రామానికి పంపించింది. ప్రస్తుతం గ్రామంలో చిన్నారులకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

యూపీలోని నెబువా నౌరంగియా బ్లాక్‌లోని గులార్హియా తోలా గ్రామంలో పింటూ గౌర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం పింటూ గౌర్ పెద్ద కుమార్తె మంజు (7)కు జ్వరం వచ్చింది. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స అందించినా బాలిక కోలుకోలేదు. దీంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయింది. ఒకరోజు గడిచిన తర్వాత పింటూ గౌర్ మూడేళ్ల చిన్న కుమార్తె ఖుషి అస్వస్థతకు గురైంది. జ్వరంతో బాధపడుతున్న ఖుషిని తొలుత జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ మెడికల్ కాలేజీకి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఖుషి కన్నుమూసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే పింటూ గౌర్ కుమారుడు కృష్ణ (5) కూడా తీవ్ర జ్వరంతో చనిపోయాడు. ఉన్న ముగ్గురు పిల్లలనూ కోల్పోయిన పింటూ గౌర్ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది. ముగ్గురు చిన్నారుల మృతి నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. గ్రామంలోని మిగిలిన పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
fever deaths
children deaths
Pintu Gaur
Uttar Pradesh
Gularhia Tola village
medical camp
UP News
Gorakhpur medical college

More Telugu News