DK Shivakumar: సీఎం సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్.. చర్చలు షురూ!
- కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న సంక్షోభం
- అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్
- బెంగళూరులోని సీఎం నివాసంలో ఇద్దరు నేతల బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
- విభేదాలు పరిష్కరించుకున్నాకే ఢిల్లీకి రావాలని స్పష్టం చేసిన హైకమాండ్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ముందుగా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఆ తర్వాతే ఢిల్లీకి రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బెంగళూరులో సమావేశమయ్యారు. సీఎం అధికారిక నివాసం ‘కావేరి’లో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు డీకే శివకుమార్ హాజరయ్యారు.
ఈ భేటీకి ముందు విలేకరులతో మాట్లాడిన డీకే శివకుమార్, "నేను సీఎం నివాసానికి వెళ్తున్నాను. సమావేశం తర్వాత మాట్లాడతాను" అని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ సమావేశం జరుగుతోందని సీఎం సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. "ముందు మమ్మల్ని చర్చించుకోమని హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాతే ఢిల్లీకి పిలిచారు. అందుకే డీకే శివకుమార్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించాను. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామంపై రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర స్పందిస్తూ, నాయకత్వ మార్పుపై మీడియాలో వస్తున్న ఊహాగానాలే తప్ప పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్నారు. "సిద్ధరామయ్య, శివకుమార్ కలిసే పనిచేస్తున్నారు. వారి మధ్య విభేదాలు ఉంటే ఈ సమావేశంతో తొలగిపోతాయి. అది మంచి పరిణామమే" అని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చర్చలు సఫలమైతే నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో రేపు (ఆదివారం) ఇరువురినీ ఢిల్లీకి పిలిపించి సోనియా గాంధీ నేతృత్వంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భేటీ ఫలితంపైనే కర్ణాటక రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.