Building Fire: ఒక్క సిగరెట్ తో 128 ప్రాణాలు బుగ్గిపాలు..! వీడియో ఇదిగో!

Hong Kong Fire Cigarette Butt Blamed for 128 Deaths
  • హాంకాంగ్ లో భారీ అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
  • మరమ్మతు పనులు చేస్తున్న వర్కర్ సిగరెట్ తాగుతున్న వీడియో వైరల్
  • తాగి పడేసిన సిగరెట్ పీకతో నిప్పంటుకుని ఉంటుందని అనుమానాలు
హాంకాంగ్ లో ఏడు భారీ భవంతులు దగ్ధం కావడానికి, 128 మంది ప్రాణాలు పోవడానికి ఒక సిగరెట్ పీక కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. మరమ్మతు పనులు చేస్తున్న కార్మికుల్లో ఒకరు కాల్చి పడేసిన సిగరెట్ పీక వల్లే నిప్పు అంటుకుందని, క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగసిపడ్డాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పని చేస్తున్న ప్రదేశంలోనే ఓ కార్మికుడు సిగరెట్ కాలుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అగ్ని ప్రమాదానికి కారణం ఆ కార్మికుడు కాల్చిన సిగరెట్ పీకేనని ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని నిర్ధారించలేదు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

తైపోలోని వాంగ్ ఫక్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఒక్కో టవర్ 31 అంతస్తుల చొప్పున మొత్తం ఎనిమిది భారీ టవర్లు ఉన్నాయి. మొత్తంగా 2 వేల ఫ్లాట్స్ ఉన్నాయి. 1983లో నిర్మించిన ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదంలో ఇందులోని ఏడు టవర్లు బుగ్గిపాలయ్యాయి. దీంతో ఈ ఫ్లాట్లలో నివాసం ఉంటున్న 128 మంది మరణించారు.
Building Fire
Hong Kong Fire
Hong Kong
Fire Accident
China Fire
Tai Po
Wang Fuk Court
Residential Complex
Accident Investigation

More Telugu News