Kothapalem: ఏపీలోని ఆ ఊరిలో వింత ఆచారం.. మూడేళ్లకోసారి దంపతులకు మళ్లీ పెళ్లి!

Kothapalem Village Unique Remarriage Tradition in Andhra Pradesh
  • కనిగిరి మండలం కొత్తపాలెంలో తరతరాల సంప్రదాయం
  • ఈ ఏడాది 40 జంటలు మళ్లీ వివాహం చేసుకున్న వైనం
  • నాగార్పమ్మ అమ్మవారి కొలుపుల్లో భాగంగా వేడుక
ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఓ వినూత్న సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ దామిరెడ్డి వంశస్థులు ప్రతి మూడేళ్లకు ఒకసారి తమ భార్యలను మళ్లీ పెళ్లి చేసుకుంటారు. ఈ ఏడాది జరిగిన వేడుకలో ఏకంగా 40 జంటలు వేదమంత్రాల సాక్షిగా మరోసారి ఒక్కటయ్యాయి.

గ్రామంలోని నాగార్పమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే కొలుపుల సందర్భంగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయంలో భాగంగా, కొలుపుల రెండో రోజు 'పట్నం కొలుపులు' నిర్వహిస్తారు. ఈ సమయంలోనే భార్యాభర్తలు సంప్రదాయబద్ధంగా మళ్లీ వివాహ బంధంతో ఒక్కటవుతారు.

నేటి ఆధునిక కాలంలో వివాహ బంధాలు బలహీనపడుతున్నాయని, చిన్నచిన్న కారణాలకే దంపతులు విడిపోతున్నారని ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో, కొత్తపాలెం గ్రామస్థులు పాటిస్తున్న ఈ ఆచారం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇదేదో మొక్కుబడిగా కాకుండా, శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవడం విశేషం. ఈ ఆచారం ద్వారా దాంపత్య బంధం మరింత బలపడుతుందని, ఆలుమగల మధ్య అనురాగం పెరుగుతుందని గ్రామస్థులు బలంగా విశ్వసిస్తున్నారు.
Kothapalem
Kothapalem village
Prakasam district
Remarriage tradition
Damireddy community
Nagarpamma temple
Marriage rituals
Andhra Pradesh culture
Unique traditions India
Family bonding

More Telugu News