iBomma Ravi: డబ్బు కోసమే తప్పు చేశా.. ఇకపై పైరసీ జోలికి వెళ్లను: ఐబొమ్మ రవి

Ibomma Ravi Admits Guilt in Movie Piracy Case
  • పోలీసుల కస్టడీలో నోరు విప్పిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి
  • విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానన్న నిందితుడు
  • ఆరేళ్లుగా దొరక్కపోవడంతో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు వెల్లడి
పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. శుక్రవారంతో రెండో రోజు విచారణ ముగియగా, ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం తర్వాత పెదవి విప్పినట్లు సమాచారం. విదేశీ పౌరసత్వం ఉండటంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించినట్లు రవి అంగీకరించినట్లు తెలిసింది.

గత ఆరేళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో, అదే ధీమాతో తన నెట్‌వర్క్‌ను దేశ, విదేశాల్లో బలోపేతం చేశానని విచారణలో వెల్లడించాడు. "మొదట్లో కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేశాను. చేస్తున్నది తప్పని గుర్తించలేకపోయాను" అంటూ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం.

జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోతానని, మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను వేడుకున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రవికి దేశ, విదేశాల్లో ఉన్న ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు.
iBomma Ravi
Iboma
Ravi
Movie piracy
Piracy website
Telugu movies
Cybercrime
Copyright infringement
Film industry
Imandi Ravi

More Telugu News