Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... ఈవీఎంల తనిఖీ కోసం దరఖాస్తులేమీ రాలేదన్న ఎన్నికల సంఘం

Jubilee Hills By Election No EVM Verification Requests Received Says Election Commission
  • నవంబర్ 14 నుంటి 21 వరకు ఎలాంటి దరఖాస్తు రాలేదన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి 
  • మొదటి మూడు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు కోరితే తనిఖీ చేయవచ్చన్న ఎన్నికల అధికారి
  • ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఏడు రోజుల్లో రాతపూర్వక దరఖాస్తు ఇవ్వాలని వెల్లడి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఉపయెగించిన ఈవీఎంలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కీలక ప్రకటన చేశారు! ఈవీఎంల తనిఖీ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆయన తెలిపారు. ఉప ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత నవంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల నిర్ణీత గడువులో ఎలాంటి దరఖాస్తు రాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కోరితే మొత్తం ఈవీఎంలలో 5 శాతం వరకు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ వీవీపాట్‌ల తయారీ సంస్థల ఇంజనీర్ల బృందం ద్వారా తనిఖీ చేసి ధృవీకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఫలితాల తేదీ నుంచి ఏడు రోజుల లోపు రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు.

ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమాలు, భద్రతా ప్రమాణాలతో పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా వస్తున్న ఫలితాలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈవీఎం అక్రమాల కారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఎలాంటి దరఖాస్తు రాలేదని ఎన్నికల అధికారి ప్రకటించారు.
Jubilee Hills by-election
Telangana elections
EVM verification
Election Commission of India
Telangana State Election Commission
Electronic Voting Machines
VVPAT
Congress party
Election results
Ballot unit

More Telugu News