Kishan Reddy: హైటెక్ సిటీతో పోటీపడే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి: కిషన్ రెడ్డి

Kishan Reddy Announces Railway Station Development to Rival Hitech City
  • హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వెల్లడి
  • నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని వెల్లడి
హైటెక్ సిటీతో పోటీపడే విధంగా రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

హైటెక్ సిటీతో పోటీ పడే విధంగా ఇక్కడి స్టేషన్‌ల నిర్మాణాలు ఉంటాయని ఆయన అన్నారు. రూ.35 కోట్లతో రెండు విడతలుగా పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2026 ఫిబ్రవరి లోపు తొలి విడత పూర్తవుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 16 ప్రత్యేక రైళ్లను నగరంలో ఆపుతామని తెలిపారు.
Kishan Reddy
Kishan Reddy railway
Hyderabad railway stations development

More Telugu News