Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Narendra Modi Unveils Tallest Shri Ram Statue in the World
  • గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా గుర్తింపు
  • ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ శిల్పి రామ్ సుతార్ రూపకల్పన
  • ఉడిపిలో లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్న ప్రధాని
  • ఉడిపి సుపరిపాలన నమూనాను గుర్తు చేసుకున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణ గోవాలో పర్యటించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగింది.

గుజరాత్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా విగ్రహం) రూపశిల్పి రామ్ సుతార్ ఈ శ్రీరాముడి విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన గోకర్ణ జీవోత్తమ్ మఠం భారతదేశంలోని పురాతన మఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవలో ఈ మఠం పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా సారస్వత బ్రాహ్మణ సమాజంలో ఈ మఠానికి విశిష్ట స్థానం ఉంది. మఠం స్థాపించి 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 370 ఏళ్ల క్రితం గోవాలోని కనకోనా ప్రాంతంలోని పార్తగాలి గ్రామంలో ఈ మఠ ప్రాంగణాన్ని నిర్మించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ 7,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

గోవా పర్యటనకు ముందు, ప్రధాని మోదీ కర్ణాటకలోని ఉడిపిలో పర్యటించారు. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన ‘లక్ష కంఠ గీతా పారాయణం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష మంది విద్యార్థులు, పండితులు, సన్యాసులు, సాధారణ పౌరులతో కలిసి భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ గర్భగుడి ఎదుట నిర్మించిన సువర్ణ తీర్థ మంటపాన్ని ప్రారంభించారు. అలాగే, కనకదాసు శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవిత్ర కిటికీ ‘కనకన కిండి’కి బంగారు కవచాన్ని (కనక కవచం) సమర్పించారు.



Narendra Modi
Shri Ram Statue
Goa
Partagali Math
Ram Sutar
Statue of Unity
Udupi
Laksha Kantha Geeta Parayanam
Saraswat Brahmins
Shri Krishna Math

More Telugu News