Chandrababu Naidu: అమరావతిలో కొలువుదీరుతున్న బ్యాంకులు, బీమా సంస్థలు ఇవే!
- అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
- కేంద్ర మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం
- ఎస్బీఐ, ఎల్ఐసీ, నాబార్డ్ వంటి దిగ్గజ సంస్థల రాక
- రాజధానికి భారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు
- హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అమరావతిని ఒక కీలకమైన ఆర్థిక కేంద్రంగా నిలబెట్టే దిశగా జరిగిన ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ఛైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సంస్థల ఏర్పాటుతో రాజధానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
శంకుస్థాపన జరిగిన సంస్థలు, పెట్టుబడులు, ఉద్యోగాల వివరాలు
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): రూ.300 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు
2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.50 కోట్ల పెట్టుబడి, 160 ఉద్యోగాలు
3. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు: రూ.256 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు
4. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.40 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు
5. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్): రూ.200 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు
6. బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.40 కోట్ల పెట్టుబడి, 200 ఉద్యోగాలు
7. కెనరా బ్యాంక్: రూ.50 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు
8. బ్యాంక్ ఆఫ్ బరోడా: రూ.60 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు
9. ఇండియన్ బ్యాంక్: రూ.40 కోట్ల పెట్టుబడి, 105 ఉద్యోగాలు
10. నాబార్డ్: రూ.90 కోట్ల పెట్టుబడి, 160 ఉద్యోగాలు
11. పంజాబ్ నేషనల్ బ్యాంక్: రూ.15 కోట్ల పెట్టుబడి, 150 ఉద్యోగాలు
12. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: రూ.4 కోట్ల పెట్టుబడి, 65 ఉద్యోగాలు
13. ఐడీబీఐ బ్యాంక్: రూ.50 కోట్ల పెట్టుబడి, 215 ఉద్యోగాలు
14. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ): రూ.22 కోట్ల పెట్టుబడి, 1036 ఉద్యోగాలు
15. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్: రూ.93 కోట్ల పెట్టుబడి, 150 ఉద్యోగాలు
ఒకేరోజు 15 జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.