Palestine: లొంగిపోయిన పాలస్తీనియన్లను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైన్యం.. వీడియో ఇదిగో!

Israeli Army Kills Surrendered Palestinians Video Emerges
  • వెస్ట్ బ్యాంక్‌లో లొంగిపోయిన ఇద్దరు పాలస్తీనియన్ల కాల్చివేత
  • ఇది దారుణమైన హత్య అంటూ పాలస్తీనా తీవ్ర ఆరోపణలు
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న ఇజ్రాయెల్ సైన్యం
  • సైనికులను ప్రశంసించిన ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి
  • 9 నెలల తర్వాత జైలు నుంచి పాలస్తీనియన్-అమెరికన్ టీనేజర్ విడుదల
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇద్దరు పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ దగ్గర ఆయుధాలు లేవన్న సంకేతంతో చేతులెత్తి లొంగిపోయిన తర్వాత వారిని కాల్చి చంపారని, ఇది ‘కోల్డ్ బ్లడ్’ హత్యేనని పాలస్తీనా అధికారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అరబ్ టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, ఇద్దరు వ్యక్తులు ఓ గ్యారేజ్ నుంచి చేతులు పైకెత్తి, తమ వద్ద పేలుడు పదార్థాలు లేవని చూపిస్తూ బయటకు రావడం కనిపించింది. సైనికులు వారిని నేలపై పడుకోబెట్టి, ఆ తర్వాత తిరిగి గ్యారేజ్‌లోకి వెళ్లమని ఆదేశించారు. మరో వీడియోలో వారు నేలపై ఉండగానే తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలారు.

మరణించిన వారిని వాంటెడ్ మిలిటెంట్లుగా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. వారు సైనికులపై పేలుడు పదార్థాలు విసిరి, కాల్పులు జరిపారని తెలిపింది. అయితే, లొంగిపోయిన తర్వాత కాల్పులు జరగడంపై సమీక్ష జరుపుతున్నట్లు వివరించింది. కానీ, ఇజ్రాయెల్ జాతీయ భద్రతా శాఖ మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ సైన్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులు చావాల్సిందేనని వ్యాఖ్యానించారు. పాలస్తీనా ప్రధాని కార్యాలయం మాత్రం ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి చేసిన హత్య అని ఖండించింది. కాగా, 9 నెలలుగా ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న 16 ఏళ్ల పాలస్తీనియన్-అమెరికన్ టీనేజర్‌ను గురువారం రాత్రి విడుదల చేశారు.
Palestine
Israeli army
West Bank
Palestinians killing
Itamar Ben-Gvir
Israel Palestine conflict
Israeli forces
violence
middle east

More Telugu News