Andhra Pradesh Districts: ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Issues Preliminary Notification for Three New Districts
  • ఏపీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్
  • మదనపల్లె, మార్కాపురం, పోలవరం కేంద్రంగా కొత్త జిల్లాలు
  • కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
  • అభ్యంతరాలకు 30 రోజుల గడువు
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మదనపల్లె, మార్కాపురంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.

కొత్త జిల్లాలతో పాటు నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకిని నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని సూచించారు.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కొన్ని మండలాలను వేరే జిల్లాలకు, రెవెన్యూ డివిజన్లకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దోట్ మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి మార్చింది. అదేవిధంగా కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ పలు మండలాల రెవెన్యూ డివిజన్లను మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
Andhra Pradesh Districts
AP New Districts
District Reorganization
Madanapalle District
Markapuram District
Polavaram District
Sai Prasad
Revenue Divisions Andhra Pradesh
AP Government
New Revenue Divisions

More Telugu News