Anantapur: అనంతపురంలో డిప్యూటీ తహసీల్దార్ భార్య, కుమారుడి అనుమానాస్పద మృతి

Anantapur Deputy Tahsildar Wife Son Die Suspiciously
  • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
  • కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న పోలీసులు
  • మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ
అనంతపురం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్య, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుమారుడిని హత్య చేసిన తర్వాత తల్లి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి, రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయన అనంతపురంలోని శారదా నగర్‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో ఆయనకు వివాహం కాగా, వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు. గురువారం విధులకు వెళ్లిన రవి, సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు.

దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా, లోపల అమూల్య ఉరివేసుకుని కనిపించింది. మంచంపై కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఈ దృశ్యం చూసి షాక్‌కు గురైన రవి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఇది ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
Anantapur
Amulya
Deputy Tahsildar
Ravi
Saharsha
Family Dispute
Suspicious Death
Crime News
Andhra Pradesh
Suicide Investigation

More Telugu News