David Beckham: కొత్తవలస పాఠశాలను సందర్శించిన సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్... మంత్రి నారా లోకేశ్ స్పందన
- విశాఖ సమీపంలోని కొత్తవలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డేవిడ్ బెక్‌హామ్
- యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో విద్యార్థులతో గడిపిన ఫుట్‌బాల్ దిగ్గజం
- విద్యార్థులతో కలిసి ఆడుతూ ఫుట్‌బాల్ మెళకువలు నేర్పిన బెక్‌హామ్
- బెక్‌హామ్ పర్యటనపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. నిన్న విశాఖపట్నం సమీపంలోని కొత్తవలసలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించి, అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెల్లడిస్తూ, బెక్‌హామ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిన్న ఏపీలోని కొత్తవలస పాఠశాలకు ఎవరొచ్చారో చెప్పగలరా...? అంటూ లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్ లో డేవిడ్ బెక్ హామ్ వచ్చాడని వెల్లడిస్తూ, ఓ వీడియోను కూడా పంచుకున్నారు.
పాఠశాల పర్యటనలో భాగంగా బెక్‌హామ్ విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించాడు. తరగతి గదుల్లో వారితో మాట్లాడటమే కాకుండా, ప్లే గ్రౌండ్ లోకి వెళ్లి వారితో కలిసిపోయాడు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారితో ఆడిపాడాడు. బెక్‌హామ్ ఉత్సాహం, చురుకైన ప్రవర్తన విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపాయని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, విద్యార్థులకు బెక్‌హామ్ సరదాగా ఫుట్‌బాల్ మెళకువలు నేర్పించాడు. "బెండ్ ఇట్ లైక్ బెక్‌హామ్" షాట్‌ను ఎలా ఆడాలో చేసి చూపించడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పిల్లల కలలు, విద్య పట్ల బెక్‌హామ్ చూపిస్తున్న నిబద్ధత ప్రశంసనీయమని లోకేశ్ అన్నారు. ఈ పర్యటన విద్యార్థులకు జీవితకాలం గుర్తుండిపోయే మధురానుభూతిని ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.