Kawaljeet Singh: రూ.26 వేల జీతం.. రూ.70 వేల ఐఫోన్.. ఉద్యోగిపై యజమాని పోస్ట్‌పై రచ్చ!
- రూ.26 వేల జీతగాడి చేతిలో రూ.70 వేల ఐఫోన్
- ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక చూసి ఆశ్చర్యపోయిన యజమాని
- సోషల్ మీడియాలో యజమాని పోస్ట్‌తో మొదలైన చర్చ
- తక్కువ జీతం ఇస్తున్నారంటూ యజమానిపై నెటిజన్ల విమర్శలు
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త తన ఉద్యోగి ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుకుని తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. నెలకు కేవలం రూ.26,000 జీతం తీసుకునే తన ఉద్యోగి, ఏకంగా రూ.70,000 విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద చర్చే మొదలైంది.
ఢిల్లీలో 'ఖడక్ సింగ్ దా ధాబా', 'ది చైనా డోర్' రెస్టారెంట్లను నడుపుతున్న కవల్జీత్ సింగ్ వద్ద ఒక వ్యక్తి ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల అతను కంపెనీ నుంచి ఒక నెల జీతం అడ్వాన్స్‌గా తీసుకుని, మరికొంత డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తానికి 12 నెలల ఈఎంఐ ప్లాన్‌పై కొత్త ఐఫోన్ కొనుగోలు చేశాడు.
ఈ విషయాన్ని కవల్జీత్ సింగ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. తన ఉద్యోగి జీతం రూ. 26 వేలని, కానీ, రూ. 70 వేల ఐఫోన్ కొన్నాడని, అతడి ఫైనాన్సింగ్ ప్లాన్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. కొందరు ఉద్యోగి ఆర్థిక క్రమశిక్షణ లేమిని తప్పుపట్టగా, మరికొందరు ఇంత తక్కువ జీతం ఇస్తూ ఉద్యోగిని ఆన్లైన్లో ఎగతాళి చేస్తావా? అంటూ యజమానిపై విరుచుకుపడ్డారు.
తక్కువ జీతం ఇస్తున్నారన్న విమర్శలపై కవల్జీత్ సింగ్ స్పందించారు. తన ఉద్యోగికి జీతంతో పాటు వసతి, భోజన ఖర్చులను కూడా కంపెనీయే భరిస్తోందని, ఆ ఖర్చులే నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉంటాయని ఆయన వివరణ ఇచ్చారు.