Yanamala: మాజీ ముఖ్యమంత్రి జగన్ కు యనమల హితవు.. ఏమన్నారంటే!

Yanamalas Advice to Former CM Jagan on Assembly Conduct
  • మాక్ అసెంబ్లీ నడిపిన తీరుకు విద్యార్థులపై ప్రశంసలు
  • వారిని చూసైనా నేర్చుకోవాలంటూ జగన్ కు సూచన
  • జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలన్న యనమల
చిన్న పిల్లలైనా చక్కగా అసెంబ్లీ నడిపారంటూ విద్యార్థుల మాక్ అసెంబ్లీపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు. వాళ్లను చూసైనా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రజా సమస్యలపై ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఇప్పటికైనా అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్ కు సూచించారు.

ప్రజలకు ప్రతినిధిగా జనం సమస్యలపై బయటకన్నా సభలో మాట్లాడడం వల్ల ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. లేదంటే త్వరలోనే అర్హత కోల్పోయే పరిస్థితి వస్తుందని జగన్ ను ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాక్ అసెంబ్లీ నడిపిన తీరును యనమల కొనియాడారు. ఎలాంటి బహిష్కరణలకు తావివ్వకుండా, ప్రజా సమస్యలను సభలోనే ప్రస్తావిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు.
Yanamala
jagan
Andhra Pradesh
AP Assembly
TDP
YSRCP

More Telugu News