Amala Akkineni: అక్కినేని కోడళ్లుగా శోభిత, జైనబ్.. అమల ఆసక్తికర వ్యాఖ్యలు

Amala Akkineni Talks About Her Daughters in Law Shobita and Zainab
  • ఇద్దరు కోడళ్ల రాకతో తమ ఇంట రెట్టింపు సంతోషమన్న అమల
  • శోభిత చాలా ప్రతిభావంతురాలు, స్నేహశీలి అని ప్రశంస
  • జైనబ్ రాకతో తమ ఇంట్లోకి ఇస్లాం సంప్రదాయం వచ్చిందన్న అమల
అక్కినేని కుటుంబంలో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహం 2024 డిసెంబర్‌లో జరగ్గా; చిన్న కుమారుడు అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, తన ఇద్దరు కోడళ్ల రాకతో ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం గురించి నటి అమల అక్కినేని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ "అత్తగా మారడం చాలా అద్భుతమైన అనుభూతి. నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు" అన్నారు. నాగచైతన్య భార్య శోభిత గురించి చెబుతూ "శోభిత చాలా ప్రతిభావంతురాలు, స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఆమెతో సమయం గడపడం నాకెంతో ఇష్టం" అని ప్రశంసించారు.

ఇక చిన్న కోడలు జైనబ్ గురించి మాట్లాడుతూ "జైనబ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆమె తన రంగంలో నిష్ణాతురాలు. జైనబ్ రాకతో మా హిందూ కుటుంబంలోకి ఇస్లాం సంప్రదాయం కూడా వచ్చింది. ఇది ఎంతో అందమైన విషయం" అని అమల వివరించారు.

తమ కుటుంబంలోని విభిన్న ఆధ్యాత్మిక మార్గాల గురించి కూడా అమల పంచుకున్నారు. "మా మావయ్య గారు (ఏఎన్నార్) పనినే దైవంగా భావించేవారు. నేను బౌద్ధ బోధనలు, విపాసన పాటిస్తాను. ఇప్పుడు మా ఇంట్లోకి ఇస్లాం కూడా వచ్చింది. మేమంతా మా నమ్మకాల పట్ల నిజాయతీగా ఉంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఇదే మా కుటుంబంలోని ప్రత్యేకత" అని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంలోని ఉన్నత విలువలను తెలియజేస్తున్నాయి.
Amala Akkineni
Akkineni family
Naga Chaitanya
Sobhita Dhulipala
Akhil Akkineni
Zainab Ravjee
Telugu cinema
family values
interfaith marriage
Tollywood news

More Telugu News