Rani Kumudini: రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం

Rani Kumudini directs officials on Panchayat Elections
  • కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్
  • ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచన
  • ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్న ఎన్నికల కమిషనర్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆమె సూచించారు. కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల నియామావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆమె అన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియతో పాటు భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సందర్భంగా చర్చించారు. అదనపు డీజీ మహేశ్ భగవత్, పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Rani Kumudini
Telangana Panchayat Elections
State Election Commissioner
Telangana Elections

More Telugu News