Nara Lokesh: ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రామ్ లాల్ తో మంత్రి నారా లోకేశ్ సమావేశం
- ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశం
- ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ భేటీ
- దేశవ్యాప్త కార్యక్రమాలను వివరించిన రామ్ లాల్
- సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్ తో సమావేశమయ్యారు. బుధవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇది పూర్తిగా మర్యాదపూర్వక సమావేశమని మంత్రి లోకేశ్ స్వయంగా వెల్లడించారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థ విశిష్టత గురించి రామ్ లాల్ తనకు వివరించారని లోకేశ్ పేర్కొన్నారు.
రామ్ లాల్ 2006-2019 మధ్యకాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత), ఆర్ఎస్ఎస్‌లో పలు ఉన్నత పదవుల్లో పనిచేశారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నట్లు ఆయన తన ప్రకటనలో తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను, ఫోటోలను లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ భేటీ సందర్భంగా లోకేశ్... మంగళగిరి చేనేత శాలువా కప్పి రామ్ లాల్ ను సత్కరించారు. ఆయనకు బాలల రాజ్యాంగం పుస్తకాన్ని బహూకరించారు.