DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు.. మీకు నేను ఫోన్ చేస్తానని డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ మెసేజ్

Rahul Gandhi Message to DK Shivakumar on CM Change Rumors
  • రాహుల్ గాంధీని కలిసేందుకు డీకే శివకుమార్ ప్రయత్నాలు
  • వేచి ఉండండి.. మీకు నేను కాల్ చేస్తానంటూ రాహుల్ గాంధీ సందేశం
  • మరోసారి ఢిల్లీ వెళ్లనున్న డీకే శివకుమార్
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని చెబుతున్నప్పటికీ, ఆ పదవిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ పంపిన సందేశం ఆసక్తికర చర్చకు దారితీసింది.

రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. డీకే శివకుమార్ కూడా ఈ విషయంపై రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, 'వేచి ఉండండి. నేను మీకు కాల్ చేస్తాను' అని రాహుల్ గాంధీ ఆయనకు సందేశం పంపినట్టుగా వార్తలు వచ్చాయి.

సిద్ధరామయ్య పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డీకే శివకుమార్ చెబుతున్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ ఊహాగానాలకు ముగింపు పలకాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీలోపు అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ త్వరలో సమావేశం కానున్నారని సమాచారం.
DK Shivakumar
Rahul Gandhi
Karnataka
Chief Minister
Siddaramaiah
AICC
Congress

More Telugu News