Ayyappa devotees: శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు శ్రీకాకుళం భక్తులు మృతి

Road Accident Near Rameshwaram Kills Two Ayyappa Pilgrims From Srikakulam
  • తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం
  • లారీ, అయ్యప్ప భక్తుల కారు ఢీ కొన్న వైనం
  • స్పాట్ లోనే ఇద్దరు దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు
శబరిమల యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భక్తులు మరణించారు. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, వీరరామచంద్రాపురం, పెదంచలకు చెందిన ఆరుగురు వ్యక్తులు అయ్యప్ప మాల ధరించారు. ఇందులో భాగంగా అయ్యప్పను దర్శించుకుని మాల విరమణ చేయడానికి ఓ కారులో శబరిమల వెళ్లారు. స్వామిని దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం కాగా.. రామేశ్వరం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు, ఓ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్‌ (24), సాయి (25) అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే రామేశ్వరం బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప భక్తుల మృతి పట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Ayyappa devotees
Sabarimala
Srikakulam
Road accident
Tamil Nadu
Rameshwaram
Palasa
Pilgrimage
Gouthu Sireesha
Ram Mohan Naidu

More Telugu News