NBK 111 Movie: బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా షురూ.. యోధుడిగా నటసింహం

Balakrishna NBK 111 Movie Begins with Pooja Ceremony
  • 'ఎన్‌బీకే 111' వర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రారంభం
  • చారిత్రక యాక్షన్ డ్రామాగా రానున్న మూవీ
  • బాలయ్య సరసన హీరోయిన్‌గా నయనతార
  • డిసెంబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాకు 'ఎన్‌బీకే 111' అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి శ్రీను, బాబి కొల్లి, బుచ్చిబాబు, నిర్మాత కేఎస్ రామారావు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని భారీ చారిత్రక యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. గోపీచంద్ మలినేని ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. 'సింహా', 'శ్రీ రామరాజ్యం' చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం 'అఖండ 2' ప్రచార కార్యక్రమాల్లో ఉన్న బాలయ్య, డిసెంబర్ మూడో వారం నుంచి 'ఎన్‌బీకే 111' రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
NBK 111 Movie
Nandamuri Balakrishna
Balakrishna NBK 111
Gopichand Malineni movie
Nayanatara movie
Veera Simha Reddy
Telugu movies 2024
Historical action drama
Ramanaidu Studios
SS Thaman music
Vriddhi Cinemas

More Telugu News