Kalaiyarasan: ఓటీటీలో 'దండకారణ్యం' .. అడుగుపెట్టి చూడాల్సిందే!

Thandakaaranyam Movie Update
  • తమిళ సినిమాగా 'దండకారణ్యం'
  • అడవి బిడ్డల అణచివేతనే కథ 
  • 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ 
  • అందుబాటులోకి రాని తెలుగు ఆడియో 
  • హైలైట్ గా నిలిచిన లొకేషన్స్     

దూరం నుంచి చూడటానికి అడవులు చాలా అందంగా .. ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని, అడవిలోని జంతువులను .. మృగాలను చూడటం సరదాగా ఉంటుంది. కానీ అడవి అంటే ఏమిటో .. అడవిలో ఏం జరుగుతుందో ఆ అడవిని నమ్ముకుని జీవించేవారికి మాత్రమే తెలుసు. వాళ్లు తన ఒడిలో పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసే అడవికి మాత్రమే తెలుసు. అలాంటి అడవి నేపథ్యంలో రూపొందిన సినిమానే 'దండకారణ్యం'. 
 
కలైయరసన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, అతియన్ అతిరై దర్శకత్వం వహించాడు. ఇక దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న పా. రంజిత్ ఈ సినిమాకి నిర్మాత కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో తెలుగు ఆడియో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

అడవి నేపథ్యంలోని కథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కాకపోతే అడవి వైపు నుంచి ఆ సినిమాలు చూపించిన సమస్యలు వేరు. ఈ సినిమా విషయానికి వస్తే, ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడి పోరాటమే ఈ సినిమా. తన గూడెం ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఆ యువకుడు, ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుటాడు. అందుకు ఎదురైన అవాంతరాలను అతను ఎలా అధిగమించాడు? తన గూడెం ప్రజల కోసం ఏం చేశాడు? అనేదే కథ. అడవికి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ లొకేషన్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చు.

Kalaiyarasan
Dandakaranyam
Amazon Prime
OTT Release
Pa Ranjith
Tamil Movie
Tribal Story
Forest Movie
Indian Army
Adivasi

More Telugu News