మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన.. రూ.17 కోట్ల పారితోషికం
- ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన వేడుకల్లో అమెరికన్ పాప్ స్టార్ ప్రదర్శన
- గతంలోనూ భారత్ లో జరిగిన పలు వివాహ వేడుకల్లో జెన్నిఫర్ ఆటాపాటా
- 2015 లో జరిగిన సంజయ్ హిందూజా వివాహ వేడుకల్లో పాల్గొన్న జెన్నిఫర్ లోపేజ్
- అప్పట్లో ఆమెకు రూ.6.5 కోట్ల పారితోషికం
ఈ వేడుకల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన ఇచ్చారు. అయితే, ఈ ఒక్క ప్రదర్శనకు జెన్నిఫర్ లోపేజ్ ఏకంగా రూ.17 కోట్లు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఉదయ్ పూర్ లో జరిగిన పలు వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ పాల్గొన్నారు. 2015లో జరిగిన సంజయ్ హిందూజా పెళ్లికి జెన్నిఫర్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చినందుకు గానూ జెన్నిఫర్ 6.5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని సమాచారం. నాలుగు రోజుల క్రితం ఉదయ్ పూర్ లో జరిగిన మంతెన వారి వేడుకల్లో పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ప్రదర్శనలు ఇచ్చారు.