Stephen Movie: కచ్చితంగా ఇది థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడేవారి కోసమే!

Stephen Movie Update
  • తమిళ థ్రిల్లర్ సినిమాగా 'స్టీఫెన్'
  • వరుస హత్యల చుట్టూ తిరిగే కథ
  • కొత్ పాయింట్ ఉందంటున్న డైరెక్టర్  
  • ఐదు భాషల్లో అందుబాటులోకి
  • డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్
థ్రిల్లర్ .. థ్రిల్లర్ .. ఇప్పుడు ఈ జోనర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఈ జోనర్ నుంచి చాలా తక్కువ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఈ కంటెంట్ కి ఒక రేంజ్ లో డిమాండ్ పెరిగిపోయింది. అందువలన సినిమాలు .. సిరీస్ లు ఆ దిశగా పరుగులు తీస్తున్నాయి. శుక్రవారం రోజున ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఏ థ్రిల్లర్ సినిమా వచ్చిందా అని గాలించేవారి సంఖ్య ఎక్కువైపోయింది. అలాంటి కంటెంట్ ఎక్కడా కనిపించకపోతే ఉస్సూరుమనుకునే పరిస్థితి వచ్చింది. 

థ్రిల్లర్ జోనర్ ను .. కంటెంట్ ను ఇష్టపడేవారిని ఇప్పుడు ఒక సినిమా ఊరిస్తోంది. ఆ సినిమా పేరే 'స్టీఫెన్'. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. పోస్టర్స్ నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేపుతోంది. 'గార్గి' ఫేమ్ గోమతి శంకర్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. మిథున్ బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

థ్రిల్లర్ సినిమాలు క్రైమ్ .. సస్పెన్స్ .. ఇన్వెస్టిగేషన్ తో కలిసి సాగుతుంటాయి. హత్యలు జరుగుతాయి .. హంతకుడు ఎవరు? సైకోను ఎలా కనిపెట్టారు? ఎలా పట్టుకున్నారు? అనేవి కీలకంగా మారతాయి. అయితే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో ఒక కొత్త ట్విస్ట్ ఉందని దర్శకుడు చెబుతున్నాడు. డిఫరెంట్ గా ఉండే ఆ ట్విస్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుందని అంటున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో థ్రిల్లర్ ప్రేమికులకు కనెక్ట్ అవుతుందో.

Stephen Movie
Stephen
Thriller movies
Gomathi Sankar
Netflix
Mithun Balaji
Crime thriller
Psychological thriller
OTT movies
Telugu movies

More Telugu News