Upendra: రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై ఉపేంద్ర ప్రశంసలు

Upendra Praises Ram Pothinenis Andhra King Taluka
  • ఇదొక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న చిత్రమని వ్యాఖ్య
  • సామాన్య అభిమానిగా రామ్ నటన అద్భుతంగా ఉందన్న ఉపేంద్ర
  • చిరంజీవి గారితో సినిమా తీయాలని ఉందని వెల్లడి
రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ ఉపేంద్ర, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రం ఈ గురువారం విడుదల కానున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదొక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న చిత్రమని, ఒక స్టార్ హీరోకి, అతన్ని ప్రాణంగా ఆరాధించే అభిమానికి మధ్య జరిగే కథ అని తెలిపారు.
 
దర్శకుడు మహేశ్‌బాబు హీరో-అభిమాని మధ్య ఉండే బంధాన్ని చాలా కొత్తగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని ఉపేంద్ర ప్రశంసించారు. ఈ కథ విన్నప్పుడు తాను కూడా ఒక ప్రేక్షకుడిలాగే ఫీలయ్యానని పేర్కొన్నారు. రామ్ గొప్ప నటుడని, ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్య అభిమానిలో ఉండే అమాయకత్వాన్ని ఆయన పలికించిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే రెట్రో ప్రేమకథ హృదయాలను హత్తుకుంటుందని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయని, ఇంత మంచి ఎమోషనల్ సినిమాను నిర్మించినందుకు వారిని అభినందించారు.
 
ఈ సందర్భంగా ఉపేంద్ర తన వ్యక్తిగత ఇష్టాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి  సినిమాలను మొదటి రోజు మొదటి షో చూసేవాడినని, ఆ అనుభూతే వేరని తెలిపారు. ఆయన సినిమాకు దర్శకత్వం వహించాలనేది తన కల అని త్వరలోనే ఆ కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
Upendra
Ram Pothineni
Andhra King Taluka
Mahesh Babu
Bhagya Shree Borse
Telugu Movie
Chiranjeevi
Mythri Movie Makers
Hero Fan Sentiment
Tollywood

More Telugu News