N Nadendla Manohar: ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రూ.14 వేల కోట్లు సిద్ధం: మంత్రి నాదెండ్ల

N Nadendla Manohar Rs 14000 crore readied for Kharif paddy procurement
  • ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల
  • అనపర్తి నియోజకవర్గంలో ఆర్ఎస్కే కేంద్రాల సందర్శన
  • గతేడాది కన్నా రూ.72 అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని హామీ
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లను సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
 
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. బలభద్రాపురం, పొలమూరు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతు కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, గతేడాది కంటే క్వింటాలుకు రూ.72 అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన వివరించారు.
N Nadendla Manohar
Kharif paddy procurement
Andhra Pradesh
Paddy purchase
Farmer welfare
Minimum support price
East Godavari district
Anaparthi constituency
రైతు సేవా కేంద్రాలు

More Telugu News